హైదరాబాద్లో హృదయాలను హత్తుకున్న ఘటన: చిన్నారులకు లంబోర్గిని కారులో రైడ్ ఇప్పించిన వ్యాపారవేత్త

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిశాంత్ సాబూ తన షోరూమ్ బయట లంబోర్గిని కారును ఆశ్చర్యంగా చూస్తున్న యశ్విక, విహాన్ అనే ఇద్దరు పాఠశాల విద్యార్థులను లోపలికి ఆహ్వానించారు. వారి కోరికను అర్థం చేసుకుని కార్లతో పాటు ఫొటోలు దిగే అవకాశం కల్పించారు. ఆ తర్వాత వారిని తన లంబోర్గిని కారులో సుందరమైన రైడ్కు తీసుకెళ్లినట్లు నిశాంత్ సాబూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.