అధిక ఉష్ణోగ్రతలకు అలవాటు పడుతున్న కీటకాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: World

భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో డైమండ్‌బ్యాక్ మాత్ కీటకాల్లో జన్యుపరమైన మార్పులు వస్తున్నాయి. మూడేళ్ల పాటు తీవ్రమైన వేడికి గురికావడం వల్ల వీటి సంతతి అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు విపరీతమైన ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని జీవించే శక్తిని సంతరించుకున్నట్లు శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.