తుఫాను వేళ ప్రజల ప్రాణరక్షణే ప్రథమ కర్తవ్యమన్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

విపత్తుల సమయంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి అన్నారు. తుఫాను ముందస్తు జాగ్రత్తలపై ఆదివారం ప్రకటన విడుదల చేసిన ఆయన, జిల్లాలో విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రజల ప్రాణరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంయమనం పాటిస్తూ, అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.