వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
వైయస్ఆర్ సీపీ మరియు మీడియా నిలదీతతో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియపై వెనక్కి తగ్గింది. తొలుత రాత పరీక్ష లేకుండానే పశుసంవర్ధక శాఖ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని నిర్ణయించగా, తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా ఏపీపీఎస్సీ ద్వారానే నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.