తీవ్ర తుఫాను ముప్పు: ముంబైలో సంయుక్త పరిశోధనా కేంద్రం ఏర్పాటు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
మహారాష్ట్ర తీర ప్రాంతంలో ప్రాణ నష్టాన్ని నివారించడానికి ముంబై విశ్వవిద్యాలయం మరియు హైదరాబాద్ కు చెందిన ఇన్కాస్ సంస్థ సంయుక్తంగా ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వైస్ ఛాన్సలర్ రవీంద్ర కులకర్ణి తెలిపారు. ముంబై, పాల్ఘర్, రత్నగిరి జిల్లాల్ లో సునామీలు, సముద్రపు అలల ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.