నెల్లూరు జీజీహెచ్‌లో అందుబాటులోకి క్రిటికల్ కేర్ బ్లాక్
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర సేవలందించే క్రిటికల్ కేర్ బ్లాక్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అత్యంత అధునాతన పరికరాలతో కూడిన ఈ 50 పడకల విభాగాన్ని శనివారం ప్రారంభించారు. మరో నెలలో ఈ భవనం పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రానుంది. ప్రస్తుతం క్యాజువాలిటీ మొత్తాన్ని సీసీబీలోకి బదిలీ చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది.