పెద్దపల్లిలో అనాథ వృద్ధురాలిని రక్షించి ఆశ్రమానికి తరలింపు
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా పట్టణ పరిధిలో రోడ్డు పక్కన మతిస్థిమితం లేని పరిస్థితిలో తిరుగుతున్న గుర్తుతెలియని వృద్ధురాలిని అధికారులు రక్షించారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత వెంటనే స్పందించి ఆమెను గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం బంధువులు ఎవరూ లేకపోవడంతో ఆమెను హైదరాబాద్లోని అమ్మ నాన్న ఆశ్రమానికి చేర్చారు. వయోవృద్ధుల టోల్ ఫ్రీ నెంబర్ 14567