పాఠశాల సిబ్బంది రాజకీయ కార్యకలాపాలపై నిషేధం: దీపక్ బర్మన్ సంచలన ప్రకటన
రిపోర్టర్: గోపి
స్థలం: Kolkata
ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడాన్ని నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్ వెల్లడించారు. త్వరలో అమల్లోకి రానున్న ఈ నిబంధన ద్వారా విద్యా వ్యవస్థలో పరిపాలనాపరమైన జవాబుదారితనాన్ని తీసుకురావడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.