రిమ్స్ ప్రమాద బాధితులకు ఐదు లక్షల సాయమన్న మంత్రి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ సాయం అందిస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే హైదరాబాద్కు తరలించాలని అధికారులను ఆదేశించారు. రిమ్స్లో నూతనంగా 150 బెడ్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.