తిరుపతిలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం: హోంగార్డు అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుపతిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన హోంగార్డును అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఎన్జీవోకాలనీకి చెందిన ఇద్దరి నుంచి రూ.6.95 లక్షలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు అందజేసినట్లు సీఐ రామ్కిషోర్ వెల్లడించారు. నిందితుడిపై నెల్లూరుతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో గతంలోనూ ఉద్యోగాల మోసాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు పోలీసులు స్పష్టం చేశారు.