వివేకా హత్యతో జగన్ లబ్ధి పొందారంటూ సునీల్ యాదవ్ సంచలన ఆరోపణలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Kadapa

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి లబ్ధి పొందారని ఈ కేసులో రెండో నిందితుడు యాదటి సునీల్ యాదవ్ వెల్లడించారు. హత్య వెనుక కుట్రదారులు వారేనని, వారిని నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. తనకు ప్రాణ రక్షణ కల్పిస్తే వివేకా హత్యకు సంబంధించిన సుపారీ గుట్టు విప్పుతానని సోమవారం మీడియా ముఖంగా స్పష్టం చేశారు.