మురసు తుపాను బీభత్సం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
మురసు తుపాను తీవ్రత నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణనష్టం జరగకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.