అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష: 2028 నాటికి పూర్తి లక్ష్యం
రిపోర్టర్: రాము
స్థలం: Amaravati
అమరావతి రాజధాని నిర్మాణ పనులను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నిర్దిష్ట గడువులు విధించారు. అమరావతిలో జరుగుతున్న రోడ్లు, మౌలిక వసతులు, ఐకానిక్ భవనాల పురోగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ముప్పై ఐదు వేల మంది కార్మికులతో పనులు కొనసాగుతున్నాయని, నవంబర్ పదకొండు తర్వాత సిద్ధమైన భవనాల ప్రారంభోత్సవాలు చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు.