టాలీవుడ్ హీరో నాని నుంచి రాబోతోంది సరికొత్త స్వచ్ఛమైన లవ్ స్టోరీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

త్వరలో పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నట్లు ప్రముఖ నటుడు నాని తెలిపారు. గ్యాంగ్స్టర్ రొమాంటిక్ డ్రామా బ్లడీ రోమియో సినిమా పూర్తయిన తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా అద్భుతమైన లవ్స్టోరీగా ఉంటుందని, కుటుంబాలు అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా చక్కటి వినోదంతో తెరకెక్కించనున్నట్లు నాని పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడి వివరాలను మాత్రం చిత్ర యూనిట్ ఇంకా గోప్యంగా ఉంచింది.