బిగ్ బాస్ 20లోకి ఎంట్రీ ఇవ్వనున్న రోడీస్ విన్నర్ కుశాల్ తన్వర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
రోడీస్ డబుల్ క్రాస్ మరియు స్ప్లిట్స్విల్లా X6 విజేతగా నిలిచిన కుశాల్ తన్వర్ అలియాస్ గుల్లు, ఇప్పుడు బిగ్ బాస్ 20 సీజన్లో సందడి చేయనున్నాడు. సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్న ఈ షోలో కుశాల్ పాల్గొనడం ఖాయమైంది. వరుస రియాలిటీ షో విజయాలతో దూసుకుపోతున్న కుశాల్, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ హౌస్లో తనదైన శైలిలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.