తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు సేవలు చిరస్మరణీయం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులకు గురజాడ అప్పారావు నాంది పలికారని అదితి గజపతి రాజు కొనియాడారు. కన్యాశుల్కం వంటి నాటకాల ద్వారా ఆయన సమాజంలోని దుష్ప్రవర్తనలను ఎత్తిచూపుతూ జాతికి చైతన్యాన్ని అందించారని పేర్కొన్నారు. యుగపురుషుడిగా గురజాడ సమాజాన్ని మార్పు దిశగా నడిపించారని తెలిపారు.