స్కోర్బోర్డ్ లో పేరు వద్దంటూ సర్వీసెస్ కెప్టెన్ రజత్ పలివాల్ వింత మూఢనమ్మకం

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి తాను బ్యాటింగ్ చేసే సమయంలో స్కోర్బోర్డ్ లో తన పేరు కనిపించకుండా విచిత్రమైన నిబంధనను పాటిస్తున్నట్లు సర్వీసెస్ రంజీ జట్టు కెప్టెన్ రజత్ పలివాల్ వెల్లడించారు. ఢిల్లీతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో జట్టు కష్టాల్ లో ఉన్న సమయంలో అజేయంగా సెంచరీ సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకాగ్రత కోల్పోకుండా ఉండేందుకే తాను ఈ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నట్లు స్పష్టం చేశారు.