టెక్నాలజీ వార్తలు: భారత్లో జాక్ డోర్సీ యాప్ బిట్చాట్ తొలగింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ మరియు గూగుల్ ప్లే స్టోర్ల నుండి జాక్ డోర్సీ రూపొందించిన ఆఫ్లైన్ బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్చాట్ను తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. మైనర్లపై సోషల్ మీడియా నిషేధించే ఆలోచన లేదని, సరైన ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం పరిశ్రమ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.