వన్యప్రాణుల దాడిలో తల్లి మృతి: టెక్నాలజీతో ప్రాణాలను కాపాడుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్

రిపోర్టర్: హరి స్థలం: Kashmir

కశ్మీర్ లో ఎలుగుబంటి దాడిలో తన తల్లిని కోల్పోయిన ముదసిర్ అలీ అనే ముప్ పై మూడేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు టెక్నాలజీని ఉపయోగించారు. ప్రమాదకర వన్యప్రాణుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైల్డ్ పింగ్ అనే ఉచిత ఆన్లైన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న మానవ-వన్యప్రాణుల సంఘర్షణలను నివారించడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశమని ముదసిర్ అలీ పేర్కొన్నారు.