ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన సమాఖ్య బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్, ప్యూర్, రేర్ విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో మహిళలు మరింతగా రాణించాలని, నూతన ఆవిష్కరణలతో గ్లోబల్ స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.