'బాలీవుడ్ షూటింగ్‌తో చిక్కుల్లో లీసెస్టర్‌షైర్': సౌరవ్ గంగూలీ బయోపిక్‌పై పెనాల్టీల మోత
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌ను తీవ్ర ఆర్థిక చిక్కుల్లోకి నెట్టింది. గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పిచ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు లీసెస్టర్‌షైర్‌కు 27 పాయింట్ల కోతతో పాటు 5 వేల పౌండ్లు అంటే సుమారు 6.43 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ క్రికెట్ డిసిప్లినరీ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు మైదానంలో సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ జరగడం, విపరీతమైన వేడి వాతావరణం కారణంగా పిచ్‌ను సరిగ్గా సిద్ధం చేయలేకపోయినట్లు హెడ్ గ్రౌండ్స్‌మన్ కల్లమ్ లూయిన్ వెల్లడించారు.