ఐనవోలులో మహాదుర్గ అలంకారంలో భక్తులకు భ్రమరాంబిక అమ్మవారి దర్శనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఐనవోలు
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదవ రోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. త్రిపురోపనిషత్ పారాయణము, ఆవరణ పూజ, సువాసిని పూజలు, మహా నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు.