జూరాల నీటి విడుదల కోసం రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ మండిపాటు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ నేతలు, రైతులను పోలీసులు గృహనిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు.