క్రేజీ కల్యాణం సినిమా: తెలంగాణ పెళ్లి జోష్తో ఈ నెల 16న విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో క్రేజీ కల్యాణం చిత్రాన్ని రూపొందించామని నిర్మాత బూసం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తరుణ్భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుందని ఆయన వెల్లడించారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ కథలో వినోదంతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయని, తెలంగాణ పెళ్లి జోష్ను అద్భుతంగా ఆవిష్కరించామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.