చలాన్ పేరుతో సైబర్ మోసాలపై పార్వతీపురం మన్యం పోలీసులు అప్రమత్తం

రిపోర్టర్: కిరణ్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లాలో చలాన్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలకు చలాన్ జారీ అయిందంటూ వచ్చే ఫేక్ మెసేజ్‌లు, లింక్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని, చలాన్ల చెల్లింపులకు కేవలం అధికారిక వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.