రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై ఉపముఖ్యమంత్రి భట్టి ప్రకటన
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజాభవన్లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు తెలిపారు.