'ప్రజాపాలన దినోత్సవం ఘనత నిజాం వ్యతిరేక పోరాటానిదే': మంత్రి పొంగులేటి
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో నిజాం నిరంకుశ రాజరిక విధానాలను ఎదిరించి పోరాడిన చరిత్రాత్మక ఘట్టమే ప్రజాపాలన దినోత్సవమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన విముక్తి పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని ఆయన స్పష్టం చేశారు. వారి మహత్తర పోరాటాలను గౌరవిస్తూ ప్రభుత్వం తరఫున ఈ రోజును అధికారికంగా నిర్వహిస్తున్నామని, అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.