తాగునీటి ఎద్దడి నివారణకు చొరవ: సొంత ఖర్చులతో బోరు వేయించిన అభిమన్యురెడ్డి
రిపోర్టర్: విజయ్
స్థలం: మహబూబ్నగర్
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రం కావడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందిపై బీఆర్ఎస్ యువ నాయకుడు చించోడు అభిమన్యురెడ్డి స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన తన సొంత ఖర్చులతో గ్రామంలో కొత్త బోరు వేయించారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆయన చేసిన ఈ మంచి పనిని గ్రామస్థులు అభినందించారు.