బాలింతలు శిశువుల సంరక్షణ కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ల పునరుద్ధరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం గతంలో నిలిచిపోయిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించింది. ప్రభుత్వ వైద్యశాలల్లో జన్మించే ప్రతి పసిపాపకు మెరుగైన సంరక్షణ అందించడంతో పాటు, రూ.1400 విలువ చేసే 14 రకాల వస్తువులతో కూడిన సమగ్రమైన కిట్ను ఉచితంగా అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గనుందని బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.