తుఫాన్ బీభత్సం: ఏన్కూర్ మండలంలో నేలమట్టమైన పత్తి, మిర్చి పంటలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఏన్కూర్
తుఫాన్ ప్రభావంతో ఏన్కూర్ మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, మిర్చి పంటలతో పాటు బోరు బావుల కింద సాగు చేసిన వరి పంట సైతం పూర్తిగా నేలమట్టమైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట వర్షాలపాలై తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ఆదుకోవాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతున్నట్లు స్థానికులు తెలిపారు.