తెలంగాణలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: తెలంగాణ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తూ తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.