సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి:శివప్రసాద్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: నాంపల్లి

తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడో తేదీ తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజని డాక్టర్ చినుకని శివ ప్రసాద్ స్పష్టం చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ పదిహేడో తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించి విమోచన పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయాలని సూచించారు. అమరవీరులకు సముచిత గౌరవం కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.