వారణాసి ఆలయంలో అశ్లీల నృత్యం వీడియో కృత్రిమ మేధ సృష్టేనని పోలీసుల స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: వారణాసి
వారణాసిలోని లాట్ భైరవ్ ఆలయ ప్రాంగణంలో అశ్లీల నృత్యం అంటూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన దృశ్యాలు కృత్రిమ మేధ ద్వారా సృష్టించినవేనని వారణాసి పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రతిష్టను దిగజార్చేందుకే కొందరు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని పోలీసులు వెల్లడించారు. ఈ అసత్య వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినమైన కేసు నమోదు చేయనున్నట్లు వారణాసి పోలీస్ అధికారులు మంగళవారం నాడు గట్టిగా ప్రకటించారు.