విద్యార్థులకు అలర్ట్: నేడు ఏఐబీఈ దరఖాస్తుల సవరణ ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

అఖిల భారత బార్ పరీక్ష ఏఐబీఈ 22 దరఖాస్తుల సవరణ విండోను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేడు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఫీజు చెల్లించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఫీజు చెల్లింపు గడువును కూడా ఈనెల 29 వరకు పొడిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 14న పరీక్ష నిర్వహించనున్నారు.