అధికారుల రాతిగుండెల నడుమ నిలిచిపోయిన పేదల ఆక్రోశ గర్జన
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం 27వ డివిజన్ శ్రీనివాస్ నగర్లో పేదల ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డుపై ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మహమ్మద్ సలాం మాట్లాడుతూ.. 55 ఏళ్లుగా పేదలు అక్కడ నివసిస్తున్నారని, పట్టాలు, ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పేరుతో పేదలను ఖాళీ చేయించొద్దని, జిల్లా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో యానాల సాంబశివరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, తాటి నిర్మల తదితరులు పాల్గొన్నారు.