టెక్సాస్‌లో హెచ్-వన్‌బీ వీసాదారుల కంపెనీలకు భారీ షాక్ ఇచ్చిన వ్యవసాయ శాఖ
రిపోర్టర్: శివ
స్థలం: టెక్సాస్
హెచ్-వన్‌బీ వీసాదారులను నియమించుకునే వ్యాపార సంస్థలకు ప్రభుత్వ గ్రాంట్లు నిలిపివేయనున్నట్లు టెక్సాస్ వ్యవసాయ శాఖ కమిషనర్ సిడ్ మిల్లర్ స్పష్టం చేశారు. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సంస్థలకే ప్రభుత్వ నిధులు అందాలని ఆయన పేర్కొన్నారు. విదేశీ కార్మికులను ప్రోత్సహించే వ్యాపారాలకు ప్రజల పన్నుల సొమ్ము కేటాయించకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఈ కొత్త విధానం ద్వారా స్థానిక కార్మికులకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.