అక్రమ మైనింగ్ అనుమతులకై కదలిన ఆకుతోటపల్లి ప్రజల ఆగ్రహం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 304 లోని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు లీజు ఇవ్వడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు, రైతులు ఆమనగల్ లో భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, గ్రామ పంచాయతీ ఎన్ఓసి తీసుకోకుండా అక్రమంగా అనుమతులు ఇచ్చారని, పర్యావరణాన్ని కాలుష్యం చేసే ఈ లీజును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.