బొబ్బిలిలో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఆర్నబ్ తుఫాను కారణంగా నీట మునిగిన ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మూల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో తక్షణమే ప్రవాహం సాఫీగా సాగేలా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.