జనసేన పార్టీలో చేరిన వైకాపా సీనియర్ నేతలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ నేత యనమల కృష్ణుడు సహా పలువురు వైకాపా నాయకులు శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన సిద్ధాంతాలు, పరిపాలనలో పవన్ కల్యాణ్ నిబద్ధత నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. వివిధ జిల్లాల్లో కీలక స్థానాల్లో పనిచేసిన నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా పార్టీ కేంద్ర సమన్వయ కమిటీ సభ్యులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.