టీమిండియా సెలక్షన్ పై మురళీ కార్తీక్ తీవ్ర ఆగ్రహం: కుల్దీప్, సిరాజ్ లపై ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: ఆక్లాండ్
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో స్టార్ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లకు తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై టీమిండియా మేనేజ్మెంట్ తీరును మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్రంగా తప్పుబట్టారు. జట్టు ఎంపిక వ్యూహం ఏంటో తనకు అంతుచిక్కడం లేదని, మెరుగైన ప్రదర్శన ఇస్తున్న ఆటగాళ్లను పక్కన పెట్టడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు క్రిస్ బజ్ వేదికగా జట్టు సెలక్షన్ విధానంపై కార్తీక్ పలు కీలక ప్రశ్నలు సంధించారు.