హింసా రాజకీయాలు వీడకపోతే పది రెట్ల ప్రతిఘటన తప్పదు: పవన్ కల్యాణ్ హెచ్చరిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హింస, బెదిరింపు రాజకీయాలు వీడాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ హెచ్చరించారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ మరోసారి హింసకు పాల్పడితే ఎన్డీయే కూటమి నుంచి పది రెట్ల అధికంగా ప్రతిఘటన ఉంటుందని స్పష్టం చేశారు. బలహీనులే బెదిరింపులకు పాల్పడతారని, కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.