వర్ధన్నపేటలో వంద మందికి ఎగ్ కార్డులు అందజేత

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో వర్ధన్నపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి కోళ్ల ఫామ్లో మూడు మండలాల లబ్ధిదారులకు వంద ఎగ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొని పిల్లల ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిఒక్కరూ గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.