తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసు: ఈడీ దర్యాప్తులో భారీ అట్యాచ్మెంట్

రిపోర్టర్: విజయ్ స్థలం: Tirupati

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిన ఉదంతానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సుమారు నూట ముప్పై కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వివిధ డెయిరీ సంస్థలు, వాటి ప్రమోటర్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.