మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు అందజేసిన గోండు శంకర్ శ్రీకాకుళమా
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని పెద్దగనగల్లవానిపేటలో గత ఐదు రోజులుగా వేటకు వెళ్లలేని స్థితిలో ఉన్న మత్స్యకార కుటుంబాలకు ప్రతి కుటుంబానికి యాభై కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసినట్లు గోండు శంకర్ శ్రీకాకుళమా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు చొరవతో వేట నిషేధ భృతి అందుతోందని ఆయన పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు.