ఫ్రాన్స్ లో తీవ్ర ఉద్రిక్తత: నిరసనకారులు పోలీసుల మధ్య భీకర ఘర్షణలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Paris

జీవన వ్యయం, విద్యారంగ సమస్యలపై పారిస్ లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయని ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉప్పొంగుతున్న నిరసనల్ లో భాగంగా మూడో వారమూ ఘర్షణలు కొనసాగాయి. ఆందోళనకారులు పోలీసులపై పెట్రోల్ బాంబులు, తూటాలతో విరుచుకుపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ఈ దేశవ్యాప్త ఆందోళనల్ లో సుమారు మూడు లక్షల ఇరవై వేల మంది ప్రజలు పాల్గొన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. జర్మనీలోనూ ఇదే సమస్యపై పెద్దఎత్తున ప్రదర్శనలు జరిగాయి.