అచ్యుతాపురం సెజ్ లో మాఫియా, అక్రమాల సామ్రాజ్యం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో మాఫియా ముఠాలు అరాచకాలు సృష్టిస్తున్నాయి. రాజకీయ నాయకుల సహకారంతో ఇక్కడ గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రసాయన వ్యర్థాల అక్రమ పారబోత యథేచ్ఛగా సాగుతున్నాయి. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. అధికారుల ఉదాసీనతతో ఈ ప్రాంతంలో నేర సామ్రాజ్యం ఆధిపత్యం చెలాయిస్తోంది.