అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పడిపోయిన క్రూడాయిల్ ధరలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
అంతర్జాతీయ చమురు మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన వారం రోజుల్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర సుమారు పది డాలర్ల వరకు తగ్గి భారత్ వంటి ఇంధన దిగుమతి దేశాలకు ఊరటనిస్తోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 97.56 డాలర్లు, డబ్ల్యూటీఐ క్రూడ్ 89.38 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సౌదీ అరేబియా ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్లైన్ ద్వారా సరఫరాలు పునరుద్ధరించడం, ఎర్ర సముద్ర మార్గంలో రవాణా సాఫీగా సాగడం ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.