అమరావతి స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరులోని అమరావతి స్కూల్లో గురువారం ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుల వేషధారణలో ముస్తాబైన చిన్నారుల సందడి, కోలాటాలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా అమరావతి స్కూల్ కరస్పాండెంట్ కే. సురేష్ మాట్లాడుతూ, చిన్న వయసు నుంచే విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను పరిచయం చేయడం పాఠశాల ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ వేడుకలు చిన్నారుల్లో ఆనందాన్ని నింపాయి.