బ్లడీ రోమియో సినిమా: నాని సరసన హీరోయిన్గా ప్రీతి ముకుందన్ ఖరారు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బ్లడీ రోమియో చిత్రంలో నాయికగా ప్రీతి ముకుందన్ ఎంపికైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కన్నప్ప చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ పాత్రకు దర్శక నిర్మాతలు మొగ్గు చూపారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుండగా దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.