మహిళలు, చిన్నారుల భద్రత మన బాధ్యతంటూ విశాఖ పోలీస్ కమిషనర్ పిలుపు
రిపోర్టర్: మహేష్
స్థలం: విశాఖపట్నం
మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న వేధింపులు, హింసను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని VizagCityPolice పిలుపునిచ్చారు. ఎలాంటి నేరాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి సురక్షిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. అత్యవసర సమయాల్లో బాధితులు వెంటనే డయల్ 112 నంబర్ను సంప్రదించాలని విశాఖ నగర పోలీసులు స్పష్టం చేశారు.